ఎవ్వడు ఏమనుకున్నా తగ్గేదే లే.. పూల్‌లో అనసూయ అందాల రచ్చ!

Thota Jaya Madhuri
యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు కేంద్రంగా నిలిచారు. తన స్టైల్‌, అభిప్రాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఎప్పటికప్పుడు స్పష్టమైన వైఖరి ప్రదర్శించే అనసూయ, తాజాగా షేర్ చేసిన ఫోటోలు, వీడియోలతో మరోసారి నెట్టింట రచ్చకు కారణమయ్యారు. ఎవరు ఏమనుకున్నా తన పంథాను మార్చుకోనని, తన జీవితాన్ని తాను కోరుకున్న విధంగానే జీవిస్తాననే సందేశాన్ని పరోక్షంగా అయినా మరోసారి బలంగా వినిపించారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.ట్రెడిషనల్ నుంచి వెస్ట్రన్ వరకు ఏ తరహా దుస్తులైనా కాన్ఫిడెంట్‌గా క్యారీ చేయడంలో అనసూయకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగే టీవీ షోలు, సినీ ఈవెంట్లు, అవార్డు ఫంక్షన్లకు హాజరయ్యే సమయంలో చీరలో సంప్రదాయబద్ధంగా మెరిసిపోతూ కనిపిస్తారు. అదే సమయంలో విదేశీ టూర్లు, వ్యక్తిగత వెకేషన్లకు వెళ్లినప్పుడు వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌లో స్టైలిష్‌గా దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. సందర్భానికి తగిన విధంగా తన లుక్‌ను మార్చుకుంటూ ముందుకెళ్లడమే అనసూయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఇటీవలే చీర కట్టుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనసూయకు విపరీతమైన స్పందన వచ్చింది. సంప్రదాయ లుక్‌లో ఆమెను చూసిన అభిమానులు ప్రశంసల వర్షం కురిపించగా, కొందరు నెటిజన్లు మాత్రం అనవసర వ్యాఖ్యలు చేయడానికీ వెనకాడలేదు. ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ సందర్భంగా అనసూయ తన భర్త భరద్వాజ్‌తో కలిసి బీచ్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫోటోల్లో అనసూయ స్విమ్‌సూట్‌లో కనిపించడంతో మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. కొందరు అభిమానులు ఆమె కాన్ఫిడెన్స్‌, ఫిట్‌నెస్‌ను మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం హద్దులు దాటిన దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలకు ఆమె వెనక్కి తగ్గేదిలేదని, గతంలోనూ స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. “ఎవరు ఎంత చెప్పినా, నా నిర్ణయాలు నేను తీసుకుంటాను” అన్న సందేశాన్ని ఈ రూపంలో అనసూయ మరోసారి ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇటీవల మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై అనసూయ బహిరంగంగానే స్పందించారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, వారి ఇష్టానుసారం దుస్తులు ధరించే హక్కు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో శివాజీ చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అనంతరం మహిళలకు క్షమాపణలు చెబుతూ శివాజీ చేసిన ప్రకటనపై అనసూయ ఓ వీడియో విడుదల చేసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను కూడా హీరోయిన్ కావడంతో పాటు ఓ మహిళగా, మహిళలపై జరిగే అన్యాయాలపై స్పందించడం సహజమేనని ఆమె స్పష్టం చేశారు.



ఈ నేపథ్యంలోనే అనసూయ తన స్విమ్‌సూట్ వీడియోను మళ్లీ రీషేర్ చేయడం ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది. దీని వెనుక ఆమె ఉద్దేశ్యం ఏమై ఉంటుందన్న ప్రశ్నలు నెటిజన్ల మధ్య మొదలయ్యాయి. చీర ఫోటోలు, స్విమ్‌సూట్ వీడియో—రెండింటికీ వచ్చిన కామెంట్స్‌ను పోల్చిచూపాలన్న ఆలోచనతోనే ఆమె ఈ వీడియోను రీషేర్ చేశారా? ఏ దుస్తులు ధరించినా, మహిళలపై కొందరు చేసే వ్యాఖ్యల తీరు మారదని తెలియజేయాలనుకున్నారా? లేక ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన రీషేర్ మాత్రమేనా? అనే అంశాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.ఏది ఏమైనా, అనసూయ చేసిన ఒక్క పోస్ట్ మరోసారి మహిళల దుస్తులు, వారి వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియా ట్రోలింగ్ వంటి అంశాలపై విస్తృత స్థాయిలో చర్చకు దారి తీస్తోంది. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు భయపడకుండా, తన అభిప్రాయాలను, జీవనశైలిని స్పష్టంగా వ్యక్తపరుస్తూ ముందుకెళ్తున్న అనసూయ, మహిళలకు ఒక రకంగా ధైర్యం చెప్పే ప్రతీకగా మారుతున్నారని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: