Prabhas: "స్పిరిట్" ప్రభాస్ లుక్‌లో ఎన్టీఆర్.. నా సామీ రంగా అద్దిరిపోయింది మావ కటౌట్..!
అదే పోస్టర్లో హీరోయిన్ త్రిప్తి డిమ్రీ సిగరెట్ వెలిగిస్తూ స్టైలిష్‌గా కనిపించింది. ఆమె లుక్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల నుంచే సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. అభిమానులు, సినీ విశ్లేషకులు సినిమా కంటెంట్ చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పిరిట్ పోస్టర్ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను ఎడిట్ చేసి ఒక ప్రత్యేక పోస్టర్ రూపొందించారు. ఇందులో హీరోగా ఎన్టీఆర్‌ను చూపిస్తూ, హీరోయిన్ త్రిప్తి డిమ్రీ స్థానంలో రుక్మిణి వసంత్ ని పెట్టారు. ఎన్టీఆర్ – రుక్మిణి వసంత్ కలిసి ఉన్న ఈ ఎడిటెడ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఈ పోస్టర్‌ను చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. చాలామంది “ప్రభాస్ కంటే కూడా ఈ లుక్ జూనియర్ ఎన్టీఆర్‌కు మరింత సెట్ అయింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్లోని ఇంటెన్సిటీ, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్ ఈ తరహా పాత్రలకు పర్ఫెక్ట్గా సరిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి రా అండ్ రియలిస్టిక్ సబ్జెక్ట్‌ను జూనియర్ ఎన్టీఆర్ కూడా చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.మొత్తానికి, స్పిరిట్ సినిమా పోస్టర్ ఒకవైపు ప్రభాస్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటే, మరోవైపు ఎన్టీఆర్ ఎడిటెడ్ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఇంటెన్స్ పోలీస్ డ్రామాలో జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. చూడాలి మరి, అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో!