స్పిరిట్.. యానిమల్‌ను మించిన బ్లాక్‌బస్టర్.. అమ్మతోడు రాసి పెట్టుకోండి...?
నూతన సంవత్సర వేళ ప్రభాస్ అభిమానులకు అత్యంత తీపి కబురు అందింది. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ నుంచి అర్థరాత్రి 12 గంటలకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కటౌట్‌ను ఏ రేంజ్లో వాడబోతున్నాడో ఈ ఒక్క పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు.
వంగా మార్క్ ఇంటెన్సిటీ - షాక్‌లో ఫ్యాన్స్ :
సందీప్ రెడ్డి వంగా తన గత చిత్రాలైన ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల్లో హీరోలను ఎంత రగ్గడ్‌గా, ఇంటెన్సిటీతో చూపించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించిన పవర్ఫుల్ లుక్‌లో ప్రభాస్‌ను ఆవిష్కరించాడు. ఒంటినిండా గాయాలతో, ఇంటెన్స్ కళ్లతో చూస్తున్న ప్రభాస్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ పొడవైన జుట్టు, రగ్గడ్ బాడీ లాంగ్వేజ్ ఆయనలోని అసలైన మాస్ పవర్‌ను బయటకు తీశాయి.
త్రిప్తి డిమ్రీ ఎంట్రీ:
ఇదే పోస్టర్లో కథానాయిక త్రిప్తి డిమ్రీ, ప్రభాస్‌కు లైటర్‌తో సిగరెట్ వెలిగిస్తున్న విజువల్ హైలైట్‌గా నిలిచింది. ఇది సినిమాలో వారిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ మరియు సినిమాలోని డార్క్ థీమ్‌ను సూచిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ రాగానే చాలామంది దీనిని ‘యానిమల్’లో రణబీర్ కపూర్ లుక్‌తో పోలుస్తున్నారు. అయితే, ఇక్కడ ఉన్నది ప్రభాస్ కాబట్టి, ఆ స్వాగ్ మరియు పర్సనాలిటీ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సందీప్ రెడ్డి వంగా ఈసారి ‘యానిమల్’ కంటే బలమైన ఎమోషన్స్, వైల్డ్ యాక్షన్ ఉన్న కథను సిద్ధం చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ కటౌట్:
ప్రభాస్ లాంటి భారీ కటౌట్‌ను హ్యాండిల్ చేయడంలో వంగా సక్సెస్ అయ్యాడన్న నమ్మకం ఈ ఒక్క పోస్టర్‌తోనే కలిగింది. ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్న 'రా' అండ్ 'రగ్గడ్' పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూడబోతున్నాం. సాధారణంగా ఫస్ట్ లుక్ అంటే హీరో స్టిల్స్‌ను విడుదల చేయడం అనుకుంటారు. కానీ, ఒక పోస్టర్ ద్వారా సినిమాలోని మూడ్ ఏంటో చెప్పొచ్చని సందీప్ మరోసారి నిరూపించాడు. ఈ ఫస్ట్ లుక్ ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే, విడుదలైన కొద్ది నిమిషాల్లోనే మిలియన్ల కొద్దీ లైకులు, షేర్లతో రికార్డులు సృష్టిస్తోంది.
నూతన సంవత్సరానికి ప్రభాస్ అభిమానులకు ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ ఒక బిగ్ ట్రీట్. ఇక్కడి నుంచి సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఇదే స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.