పవన్ కళ్యాణే చెప్పాడు నేను చెబితే తప్పా.. నా అన్వేషణ అన్వేష్ మరో షాకింగ్ వీడియో..?

Pandrala Sravanthi
సీనియర్ నటుడు శివాజీ దండోరా మూవీ ప్రమోషన్స్ లో ఆడవాళ్ల డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం సృష్టించాయి. ఈయన వ్యాఖ్యలపై కొంతమంది సపోర్ట్ గా మాట్లాడితే మరి కొంత మంది విమర్శించారు. అంతేకాదు మహిళా కమీషన్ విచారణకు పిలిచి తప్పు చేసినట్టు ఆయన చేతే చెప్పించారు. కట్ చేస్తే.. శివాజీకి సపోర్ట్ గా కొంతమంది నిలిచారు.కానీ కొంతమంది మాత్రం దారుణ వ్యాఖ్యలు చేశారు. అందులో నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ కూడా ఒకరు.ఆయన శివాజీ మాట్లాడిన ఇష్యూపై మాట్లాడి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా సీతాదేవి, ద్రౌపది వంటి దేవత మూర్తులను ఇందులోకి లాగారు. రేప్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడి వివాదంలో ఇరుక్కున్నారు.


 అంతేకాదు ఆ తర్వాత భారతదేశ ప్రతిష్ట దెబ్బతీసేలా థాయిలాండ్  ని పొగుడుతూ భారతదేశాన్ని అవమానిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.దీంతో చాలామంది ఇండియన్స్ అన్వేష్ ని దేశద్రోహి కింద ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా అన్వేష్ మరో సంచలన వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ పేరు లాగుతూ మాట్లాడారు.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గురించి అన్వేష్ ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా అన్వేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలోని కోర్టు సీన్ కు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కోర్టు సీన్ లో అమ్మాయిలు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చని మహిళల వస్త్రాధరణ పై అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు.


ఈ సీన్లో మహిళలు తమకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు అర్థం.. అయితే పవన్ కళ్యాణ్ మహిళలకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉంది అని మాట్లాడారు.ఆయన మాట్లాడినప్పుడు లేని తప్పు నేను మాట్లాడితే వచ్చిందా.. అన్నట్లుగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు . ప్రస్తుతం నా అన్వేషణ అన్వేష్ పెట్టిన ఈ వీడియో మరోసారి సంచలనం సృష్టిస్తోంది.చాలామంది పవర్ స్టార్ ఫ్యాన్స్ నీ వీడియోలేమో నువ్వు చేసుకోకుండా మధ్యలోకి మా హీరోని ఎందుకు లాగుతావు అంటూ మండి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: