మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న విజయ్-రష్మిక రొమాంటిక్ ఫోటో..!?
ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక ఫోటో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ ఫోటోలో హీరో విజయ్ దేవరకొండ చాలా స్పష్టంగా కనిపిస్తుండగా, ఆయనను వెనక నుంచి హగ్ చేసుకున్న అమ్మాయి మాత్రం పూర్తిగా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, ఆ ఫోటోకు సంబంధించిన కొన్ని లీకైన పిక్స్, వివిధ యాంగిల్స్‌ను ఆధారంగా చేసుకుని అభిమానులు ఆమె రష్మిక మందన్నే అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంటపై సోషల్ మీడియాలో మరోసారి గట్టిగానే చర్చ మొదలైంది.
ఇక ఇదే సమయంలో, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ ప్యాలెస్‌లో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహం జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు నిజమా కాదా అన్నది అధికారికంగా ఎవరూ వెల్లడించకపోయినా, అభిమానులు మాత్రం ఈ జంట పెళ్లి వార్తలపై భారీగా స్పందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ సందర్భంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటలీలోని రోమ్ నగరంలో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ దిగిన కొన్ని ఫోటోలు, అలాగే వెకేషన్‌కు సంబంధించిన మరికొన్ని పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. ముఖ్యంగా వాటిలో ఒక ఫోటో మాత్రం నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఆ ఫోటోలో విజయ్ దేవరకొండను వెనక నుంచి ఒక అమ్మాయి హగ్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆమె కళ్లకు గ్లాసెస్ పెట్టుకుని, చాలా స్టైలిష్‌గా కనిపించడంతో అభిమానుల దృష్టి అంతా ఆ ఫోటోపైనే పడింది.
అంతకుముందు రష్మిక మందన్న షేర్ చేసిన ఫోటోలతో ఈ ఫోటోకు పోలికలు ఉండటంతో, అదే అమ్మాయి రష్మికేనని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. దీంతో ఈ జంట చాలా క్యూట్‌గా, రొమాంటిక్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి పెళ్లి వార్తలు నిజమే అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ ఫోటోలపై కానీ, పెళ్లి వార్తలపై కానీ విజయ్ దేవరకొండ లేదా రష్మిక మందన్న అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. మరి దీనిపై ఈ స్టార్ జంట ఎలా స్పందిస్తారో, ఈ వార్తల్లో నిజమెంత ఉందో చూడాల్సిందే.