ఓటీటీలో " 4 గర్ల్స్ ( 4Girls ) " సినిమాకు ఊహించ‌ని రెస్పాన్స్‌.. నిర్మాత హుషారు...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఓటీటీ వేదికలపై ప్రస్తుతం ఓ చిన్న సినిమా సంచలనం సృష్టిస్తోంది. సమాజంలోని సున్నితమైన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిన "4 గర్ల్స్ (4Girls)" చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఒక వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ పట్ల నిర్మాతలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు మరియు అమ్మాయిలపై జరుగుతున్న గ్యాంగ్ రేపులు, హత్యల వంటి అమానుష ఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.


ఒక యువతిపై జరిగిన అన్యాయానికి, ఆమె సోదరి తన స్నేహితురాళ్లతో కలిసి ఎలా స్పందించింది ? అసలు నేరస్థులు ఎవరు? చట్టం నుంచి తప్పించుకున్న వారిని ఈ నలుగురు అమ్మాయిలు ఎలా వేటాడారు ? అన్న‌దే ఈ సినిమా మెయిన్ థీమ్‌.  తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి ఆ సోదరి పగ తీర్చుకుందా లేదా వారిని చట్టానికి అప్పగించిందా ? అనే ఆసక్తికరమైన అంశాలతో దర్శకుడు ఎస్. శివ ఈ సినిమాను తెర‌కెక్కించారు.


అన్ని ప్రధాన ఓటీటీలలో స్ట్రీమింగ్ :
నిర్మాతలు యు. నరసింహులు, ఎస్. రమేష్ మాట్లాడుతూ తమ చిత్రం అమెజాన్ ప్రైమ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, హంగామా ప్లే, టాటా ప్లే బింజ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అన్ని స్మార్ట్ టీవీ పరికరాల్లో అందుబాటులో ఉందని తెలిపారు. 4 గర్ల్స్ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ మంచి వ్యూయర్ షిప్ దక్కించుకుంటోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నేరుగా ఓటీటీలలో విడుదల చేసిన బి సినీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత బోయపాటి దిలీప్ కుమార్ గారికి నిర్మాతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సినిమాలో శృతిక గాఒక్కర్, ఆకాంక్ష వర్మ, దితిప్రియ రాయ్, సెజల్ మాండవియ, అంకుర్, ప్రిన్స్, హన్సి శ్రీనివాస్తవ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ‌య‌సూర్య సంగీతం, నేప‌థ్య సంగీతం ఎం.ఎన్.ఆర్ అందించ‌గా, ఛాయాగ్రహణం: జగదీశ్ , ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్. మంచి సందేశంతో పాటు, ఉత్కంఠను పంచే క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్‌గా రూపొందిన "4 గర్ల్స్" చిత్రం ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మహిళల రక్షణ మరియు సామాజిక బాధ్యతను గుర్తుచేసే సినిమాగా ఓటీటీలో ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: