బాలయ్య మూవీకి బడ్జెట్ కష్టాలు.. వెనక్కి తగ్గిన మేకర్స్..?

Divya
2023లో నందమూరి బాలకృష్ణ ,డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు ఇటీవలే అనౌన్స్మెంట్ చేశారు. మొదట ఈ సినిమా ఒక హిస్టారికల్ యాక్షన్ చిత్రంగా మేకర్స్ భావించినప్పటికీ ఈ క్రమంలోనే బడ్జెట్ ఎంతైనా సరే తెరకెక్కించాలని నిర్మాత వెంకట సతీష్ కిలారు అనుకున్నారు. అందుకోసం హీరోయిన్గా నయనతారను కూడా రంగంలోకి దింపారు చిత్ర బృందం.

 బాలయ్య కెరియర్ లోనే ఇప్పటివరకు చూడని ఒక కొత్త అవతారంలో చూపించాలని మేకర్స్ భావించినప్పటికీ ఈ సినిమా విజువల్ వండర్ గా ఒక గొప్ప అనుభూతి ఇచ్చేలా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు బడ్జెట్ లెక్కలన్నీ కూడా పూర్తిగా మారిపోయినట్లు వినిపిస్తున్నాయి. సడన్గా అటు నిర్మాత, డైరెక్టర్ ,హీరో అందరూ కలిసి ఈ సినిమా విషయంలో మనసు మార్చుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టి మరి మరో కథతో షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయినట్లుగా వినిపిస్తున్నాయి.


అందుకు ముఖ్య కారణం ఈ సినిమా బడ్జెట్ అన్నట్లుగా వినికిడి. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో నిర్మించాలి అంటే కనీసం రూ.100-150 కోట్ల రూపాయల బడ్జెట్ వరకు ఖర్చవుతుందని టాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇంత పెద్ద బడ్జెట్ రికవరీ చేసే పరిస్థితి బాక్స్ ఆఫీస్ వద్ద కనిపించలేదు. వీటికి తోడు ఇటీవల బాలయ్య నటించిన అఖండ 2 సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసిన నష్టాలు మిగిల్చాయనే విధంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఓటీటి లాభాలు కూడా పెద్దగా లేకపోవడంతో బాలయ్య మార్కెట్ ప్రకారం ఇంత పెద్ద బడ్జెట్ అయితే వర్కౌట్ కాదని భావించే ఇప్పుడు మరో కథతో ఈ సినిమాను ప్రారంభించబోతున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: