ట్రైలర్: విజయ్ దళపతి జననాయగన్ ట్రైలర్ రిలీజ్.. భగవంత్ కేసరినా..?

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన విజయ్ దళపతి క్రేజ్ తెలుగులో భారీగానే ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇన్ని రోజులకి హీరోగా మెప్పించిన విజయ్ ఇప్పుడు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు రాజకీయాలలో జరగబోయే ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. ఒకవైపు సినిమాలు, మరొకవైపు రాజకీయ ప్రచారాలు చేస్తూ బిజీగా ఉన్నారు విజయ్. ఇటీవలే పూర్తిగా రాజకీయాల వైపు దృష్టి పెట్టేందుకు సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు హీరో విజయ్.


విజయ్ నటిస్తున్న చివరి సినిమా జననాయగన్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం శనివారం సాయంత్రం సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. అయితే ఈ ట్రైలర్లో విజయ్ యాక్టింగ్ తో అద్భుతంగా ఆకట్టుకున్నారు.  పూజా హెగ్డే, మమిత బైజు ,బాబి డియోల్ , ప్రియమణి ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. యాక్షన్ తో పాటు బలమైన బాగోద్వేగమైన సన్నివేశాలు సైతం ఇందులో చూపించారు. ఈ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాని పోలినట్టుగా ఉందని పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.కొన్ని సీన్స్ చూస్తే భగవంత్ కేసరి సినిమాని గుర్తుకువస్తుంది.


 శ్రీలీల పాత్రలోనే మమిత బైజు నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ పాత్రలో పూజ హెగ్డే కనిపించబోతోంది. అలాగే ఇందులో కొన్ని సిన్స్ పొలిటికల్ టచ్ చూపించినట్లుగా కనిపిస్తోంది. మరి జననాయగన్ చిత్రంతో  విజయ్ అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి మరి. డైరెక్టర్ హెచ్.వినోద్ కుమార్ కూడా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలియజేశారు. ముఖ్యంగా విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. మరి ఎలాంటి రికార్డులను ఈ సినిమా తిరగరాస్తుందో చూడాలి మరి. ప్రస్తుతమైతే టైలర్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: