ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులోకి మరో క్రేజీ హీరోయిన్.. ఇక రచ్చ రంబోలానే..!?
అయితే ఈసారి ఆ ఛాన్స్‌ను చాలా ఈజీగా కొట్టేసిన ఓ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మరెవరో కాదు, మమిత బైజు. రీసెంట్‌గా వచ్చిన డ్యూడ్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ బ్యూటీ, అంతకు ముందు ప్రేమలు సినిమా ద్వారా యువ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ముఖ్యంగా తన నేచురల్ యాక్టింగ్, ఫ్రెష్ లుక్‌తో కుర్రకారును ఆకట్టుకున్న మమతా, తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు మమిత పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో ఆమె భాగమవుతోందన్న వార్త ఇండస్ట్రీలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే కథలో ఒక కీలకమైన పాత్ర కోసం యంగ్ అండ్ ఫ్రెష్ ఫేస్‌ను వెతుకుతున్న మేకర్స్, పలువురు పేర్లను పరిశీలించగా చివరకు మమతా బసు పేరు ఫైనల్ చేసినట్లు సమాచారం.సినిమాలో ఆ పాత్రకు గ్లామర్‌తో పాటు నటన కూడా అవసరం కావడంతో, మమతా ఈ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ చాయిస్‌గా మేకర్స్ భావించారట. ఆమె గత సినిమాల్లో చూపించిన పెర్ఫార్మెన్స్, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అన్నీ కలిపి ఈ అవకాశాన్ని ఆమెకు దగ్గర చేశాయని టాక్. ఈ క్రమంలోనే మమతాను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సెలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడం మమతా కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త మాత్రం ఇప్పటికే మమతా పేరు చుట్టూ భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమె స్టార్ హీరోయిన్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.