అల్లు సినిమాస్: బన్నీ చేసిన పనికి మెగా అభిమానులు ఫిదా..?

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకవైపు హీరోగా మరొకవైపు బిజినెస్ మ్యాన్ గా తన కెరియర్లో ముందుకు వెళ్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మల్టీప్లెక్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. కోకాపేటలో అల్లు సినిమాస్ పేరుతో అతి పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ ని ఏర్పాటుచేసి, ఈ థియేటర్ ని ఓపెన్ చేశారు. అయితే ఈ థియేటర్లో సినిమా చూస్తే లగ్జరీ అనుభూతిని కలిగించేలా ఉంటుంది. ఈ థియేటర్లో 75 అడుగుల భారీ స్క్రీన్ ,డాల్బీ విజన్, 3Dలాంటి ప్రత్యేకతలు కలిగి ఉంటాయి.



అయితే ఈ అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ లో మాత్రం చిరంజీవి హైలెట్గా నిలిచారు.. థియేటర్ లోపల తన తాత అల్లు రామలింగయ్య, అలాగే తండ్రి అల్లు అరవింద్ ఫోటోతో పాటుగా మేనమామ చిరంజీవి ఫోటోను కూడా అక్కడ ఒక వాల్ కి  డిజైన్ చేయించారు అల్లు అర్జున్. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఈ విషయంపై అల్లు అర్జున్ అభిమానులు కూడా అల్లు అర్జున్ చేసిన పనికి ప్రశంసిస్తున్నారు. గత కొంతకాలంగా అటు అల్లు, మెగా కుటుంబం మధ్య గొడవలు ఉన్నాయనే విధంగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.



ఈ విషయం పైన ఇరువురు కుటుంబ సభ్యులు ఎప్పుడు బయటపడలేదు. గతంలో లాగా పండుగ సమయాలలో ఈ రెండు కుటుంబాలు కలవకపోవడం ఎవరికి వారు విడిగా ఉండడంతో, పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకపోవడంతో వీరి మధ్య గొడవలు వచ్చాయనే విధంగా వార్తలు వినిపించాయి. అలాగే అల్లు అర్జున్ కూడా చాలా సార్లు తనకు తాను గానే ఎదిగానని చెప్పారని, కానీ చిరంజీవి సహాయంతోనే అల్లు అర్జున్ ఎదిగారనే విషయాన్ని మర్చిపోయి.. స్టార్ హీరో అయ్యాక రూటు మర్చిపోయారని చాలామంది మెగా అభిమానులు అల్లు అర్జున్ ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఏ విషయాలను మర్చిపోలేదని తాత తండ్రి తర్వాత ఎప్పటికీ అల్లు అర్జున్ మనసులో చిరంజీవి స్థానం ఉందని ఈ విషయంతో చెప్పుకోచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: