తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలవుతుంది. ఈయన నటుడుగా కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలో చాలా సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు కేవలం సినిమాలో హీరో పాత్రలలో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. ఈయన హీరో గా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు హీరో గా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. కొంత కాలం క్రితం శ్రీ విష్ణు "సింగిల్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం శ్రీ విష్ణు "విష్ణు విన్యాసం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.
ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ను క్లోజ్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ హక్కులను అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ హక్కులను సరిగమ సంస్థ వారు దక్కించుకున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. సింగిల్ మూవీ తో మంచి విజయాన్ని అందుకని సూపర్ ఫామ్ లో ఉన్న శ్రీ విష్ణు "విష్ణు విన్యాసం" మూవీతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.