టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరు అయినటువంటి సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ చాలా సంవత్సరాల క్రితమే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన ప్రేమ కావాలి అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈయన నటించిన లవ్ లీ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆది సాయి కుమార్ కి తాను నటించిన మూడవ సినిమా అయినటువంటి సుకుమారుడు ద్వారా మొట్ట మొదటి అపజయం దక్కింది. ఈ సినిమా తర్వాత ఈయన నటించిన ఏ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించలేదు. దానితో ఈ నటుడి కేరిర్ అనేక సంవత్సరాలు పాటు చాలా డల్ గా ముందుకు సాగింది. తాజాగా ఈయన శంబాల అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ డిసెంబర్ 25 వ తేదీన విడుదల అయింది.
ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసుకుని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని జనవరి 9 వ తేదీన హిందీ భాషలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. జనవరి 9 వ తేదీన ప్రభాస్ హీరో గా రూపొందిన రాజా సాబ్ సినిమా విడుదల కానుంది. ప్రభాస్ కి హిందీ సినీ మార్కెట్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక జనవరి 12 వ తేదీన చిరంజీవి హీరోగా రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు , జనవరి 13 వ తేదీన రవితేజ హీరోగా రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఇలా స్టార్ హీరోల సినిమాలతో పోటీగా ఆది సాయి కుమార్ "శంబాల" మూవీ హిందీ వర్షన్ తో బరి లోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. ఇక జనవరి 14 వ తేదీన శర్వానంద్ హీరోగా రూపొందిన నారీ నారీ నడుమ మురారి , నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందిన అనగనగా ఒక రాజు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మరి ఇన్ని సినిమాల పోటీని తట్టుకొని శంబాల మూవీ హిందీ వర్షన్ నిలబడుతుందేమో చూడాలి.