రవితేజ భర్త మహాశయుడికి మంచి బూస్ట్ దొరికేసింది...!
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో పక్కా మాస్ బీట్స్‌తో ఈ పాటను స్వరపరిచారు. దేవ్ పవార్ అందించిన మాస్ సాహిత్యం మరియు స్వాతిరెడ్డి గాత్రం పాటకు మరింత హుషారునిచ్చాయి.
ఈ పాటలో రవితేజ ఇద్దరు భామలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిలతో కలిసి స్టెప్పులు వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీతో చేసిన డ్యాన్స్ అభిమానులను కట్టిపడేస్తోంది. వరంగల్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ పాటను లాంచ్ చేయడం సినిమాపై హైప్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమా పేరు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని ఉండటంతో భర్త ఎదుర్కొనే సరదా ఇబ్బందుల నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది.
ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే భర్తగా రవితేజ ఈ సినిమాలో కనిపించనున్నారు. గతంలో వచ్చిన ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’ తరహాలో క్లాస్ మరియు కామెడీ ఎమోషన్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయని టీజర్ ద్వారా స్పష్టమైంది. రవితేజతో పాటు సునీల్, వెన్నెల కిషోర్, సత్య వంటి కామెడీ స్టార్స్ ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి ఎమోషనల్ హిట్ చిత్రాలను అందించిన కిషోర్ తిరుమల, ఈసారి రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారు.
ఈ సంక్రాంతికి ప్రభాస్ ‘రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ సినిమాలు ఉన్నప్పటికీ, రవితేజ తనదైన కామెడీ మార్కుతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ‘వామ్మో వాయ్యో’ పాట ఇచ్చిన ఊపుతో బాక్సాఫీస్ వద్ద ‘BMW’ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. రవితేజ మాస్ డ్యాన్స్, కిషోర్ తిరుమల క్లాస్ ఎమోషన్స్ కలగలిసి వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతికి ప్రేక్షకులను ఎంతవరకు నవ్విస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.