' మన శంకర వర ప్రసాద్ ' బిజినెస్.. చిరు ముందు బిగ్ టార్గెట్... !
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలో హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అంచనాలు మించేలా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మరియు ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, చిరంజీవి కెరీర్‌లో ఇప్పటివరకు జరిగిన బిజినెస్‌లో ఇదే అత్యధికం.
తెలుగు రాష్ట్రాల బిజినెస్:
ఆంధ్రాలో రూ.55 కోట్లు, నైజాం ( తెలంగాణ ) లో రూ.32 కోట్లు, సీడెడ్‌లో రూ.18 కోట్లుగా థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.105 కోట్ల బిజినెస్ నమోదైంది.
వరల్డ్ వైడ్ బిజినెస్: ఓవర్సీస్ రైట్స్ రూ.20 కోట్లు, కర్ణాటక మరియు మిగిలిన రాష్ట్రాల హక్కులు కలిపి దాదాపు రూ.15 కోట్లుగా అమ్ముడయ్యాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.140 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
నాన్ - థియేట్రికల్ రైట్స్:
శాటిలైట్ మరియు ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకే అమ్ముడయ్యాయి. శాటిలైట్ రైట్స్ సుమారు రూ.50 కోట్లు పలికినట్లు సమాచారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవాలంటే భారీ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.
థియేట్రికల్ బిజినెస్ రూ.140 కోట్లు కాబట్టి, బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.150 కోట్ల షేర్ వసూలు చేయాలి.
ఈ సినిమా సుమారు రూ.280 నుంచి 300 కోట్ల మార్కును అందుకోవాల్సి ఉంటుంది. అప్పుడే బయ్యర్లు లాభాల్లోకి వస్తారు.
సినిమా విశేషాలు :
తారాగణం: చిరంజీవి సరసన నయనతార, కేథరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన స్పెషల్ అప్పీయరెన్స్‌లో అలరించబోతున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు షైన్ స్క్రీన్స్ సంయుక్తంగా సుమారు రూ.200 - 250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. అనిల్ రావిపూడి తన సక్సెస్ ఫుల్ కెరీర్ లో మెగాస్టార్‌ను ఏ విధంగా ప్రజెంట్ చేస్తారన్నది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. సంక్రాంతి రేసులో ఇతర పెద్ద సినిమాలతో పోటీ పడుతూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో హవా చూపిస్తారో జనవరి 12న తేలిపోనుంది.