మన శంకరవరప్రసాద్ గారు.. చిత్రంలో వెంకటేష్ పాత్ర అదేనా..?

Divya
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా గెస్ట్ పాత్రలో హీరో వెంకటేష్ నటించగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రమోషన్స్ లో చిత్ర బృంద బిజీగా ఉన్నారు. గడిచిన కొన్ని గంటల క్రితం ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని విడుదల చేయగా ,ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. చిరంజీవి ,నయనతార మధ్య వచ్చే సీన్స్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.


అయితే ఇందులో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ కనిపించబోతున్నారు. వీరిద్దరికీ కలిసి ఒక సాంగ్ కూడా ఉండనున్నట్లు చూపించారు. దాదాపుగా ఈ చిత్రంలో వెంకటేష్ 20 నిమిషాల పాటు కనిపించబోతున్నట్లు వినిపిస్తోంది. హెలికాప్టర్లో విక్టరీ వెంకటేష్ ఎంట్రీ చాలా గ్రాండ్గా డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్లాన్ చేసినట్లు ట్రైలర్ లో చూపించారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ పాత్ర గురించి ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో నయనతారను రెండవ వివాహం చేసుకునేందుకు వెంకటేష్ వస్తాడని, కానీ అంతకుముందే మెగాస్టార్ చిరంజీవితో వెంకటేష్ కి కూడా స్నేహం ఉంటుంది.అయితే ఈ విషయం తెలియకుండా విక్టరీ వెంకటేష్ ని రెండో వివాహం కోసం నయనతార కుటుంబం దింపుతుందని టాక్ వినిపిస్తోంది.

 ఈ నేపథ్యంలోనే అటు చిరంజీవి ,వెంకటేష్ చేసే కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను ,ఫ్రాన్స్ ని ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ముందు తెలియాలి అంటే జనవరి 12వ తేదీ వరకు ఆగాల్సిందే. ట్రైలర్లో మాత్రం నయనతార, చిరంజీవి మధ్య వచ్చే సీన్స్ హైలెట్ కావడమే కాకుండా చివరిలో వెంకటేష్, చిరంజీవి కనిపించిన తీరు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ చిత్రంతో ఎలాంటి రికార్డులను తిరగ రాస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: