అనసూయ వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ వేసిన హీరోయిన్ రాశి..!
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రాశి మాట్లాడుతూ.. మైకు దొరికింది కదా అని ఏదో ఒకటి మాట్లాడొచ్చు, కానీ నేను అలా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇష్యూ నడుస్తోంది.. శివాజీ మాట్లాడింది 100% తప్పు అని నేను అనను.. ఆయన చేసిన వ్యాఖ్యలలో కొన్ని కరెక్ట్ కాదు, అలా మాట్లాడినందుకు ఆయన కూడా క్షమాపణలు చెప్పారు. శివాజీ గారు నాకు బాగా పర్సనల్ గా తెలుసు.
నేను శివాజీ గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు నా ప్రమేయం లేకుండా అనవసరంగా తన వివాదంలోకి లాగడంతో కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నానని రాశి వెల్లడించింది.
అనసూయ హోస్ట్ గా చేసిన ఒక కామెడీ షోలోని మీడియాలో తెగ వైరల్ గా మారింది.. అందులో నువ్వు రాశిగారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా? అని అనసూయ అంటుంటే.. అవి రాశి గారి ఫలాలు కాదు రాశి ఫలాలు అంటూ హైపర్ ఆది మాట్లాడారు. ఈ వీడియో చూసినప్పుడు, చాలామంది నెటిజన్స్ ట్రోల్ చేశారు. సెలబ్రెటీలు కూడా అనసూయని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయం పైన రాశి మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం ఆ షో నిర్వహకులు నాకి కాల్ చేశారు.. మీరు ప్రేయసి రావే మూవీ స్కిట్ చేయాలని అడిగారు. కానీ కామెడీ స్కిట్ చేయను జడ్జిగా రమ్మంటే వస్తానని చెప్పాను. అయినా సరే వారు ఆ స్కిట్ చేశారు. అందులో రాఖీ ఫలాలు అనే పదం వాడారు. కానీ రాశి గారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా అంటూ ఒక లేడీ యాంకర్ అలా మాట్లాడడం నేను గమనించలేదు. రాశి ఫలాలు అనడం మామూలే కానీ రాశి గారి ఫలాలు అనే పదంలో తాను ఉన్నానని, నేను అక్కడ ఉండి ఉంటే ఆ యాంకర్ ని కడిగిపారేసే దాన్ని.. ఈ విషయాన్ని లీగల్ ఇష్యూ చేద్దామనుకున్నాను కానీ మా అమ్మ చెప్పడంతో ఆగిపోయానని తెలిపింది.