సంధ్య ధియేటర్ లేడీస్ వాష్ రూమ్ లో సీక్రేట్ కెమెరా..బయటపడ్డ సంచలన నిజం..!
సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో, థియేటర్‌లోని లేడీస్ టాయిలెట్స్‌లో ఒక రహస్య కెమెరాను ఏర్పాటు చేసి మహిళలను వీడియోలు తీస్తున్నట్లు థియేటర్‌కు సంబంధించిన ఓ వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా మారింది. వాష్‌రూమ్‌లో ఉన్న కొందరు మహిళలు ఈ విషయాన్ని గమనించి వెంటనే కేకలు వేయడంతో విషయం బయటపడింది.దీంతో థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులు అక్కడికి చేరుకుని ఆ దుర్మార్గుడిని పట్టుకుని తీవ్రంగా నిలదీశారు. ఆగ్రహంతో కొందరు అతడిని చితకబాదినట్లు సమాచారం. అనంతరం పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు, అక్కడే ఉన్నవారు మాడివాళ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని తమ అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఎంతకాలంగా ఈ విధమైన దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నాడు, మరెవరైనా ఇందులో భాగస్వాములా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందా అనే అంశంపైనా పోలీసులు దృష్టి సారించారు.మహిళల భద్రత, గోప్యత విషయంలో ఇలాంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా వచ్చే సినిమా థియేటర్‌లాంటి ప్రదేశాల్లో భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై మహిళా సంఘాలు, సామాజిక వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.