ఫైనల్‌గా దొరికేసిన విజయ్ – రష్మిక: ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్!
విజయ్ మరియు రష్మిక ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒకే రకమైన నలుపు రంగు దుస్తులుధరించి కనిపించారు. వీరిద్దరూ 2026 నూతన సంవత్సర వేడుకల కోసం ఇటలీలోని రోమ్ నగరానికి వెళ్లినట్లు సమాచారం.రోమ్ నగర వీధుల్లో విజయ్ నడుస్తున్న ఫొటోలను ఆయన స్వయంగా షేర్ చేయగా, అందులో ఒక అమ్మాయి ఆయన భుజంపై తల ఆనించుకుని ఉన్నట్లు అభిమానులు గుర్తించారు. ఆ అమ్మాయి రష్మికేనని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు.రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెకేషన్ ఫొటోలలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఉండటం విశేషం. ఇది వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని, కుటుంబ సభ్యులతో కూడా మంచి అనుబంధం ఉందని స్పష్టం చేస్తోంది.
చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు అధికారికంగా ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, విజయ్ - రష్మిక వివాహం 2026 ఫిబ్రవరి 26న జరగనున్నట్లు సమాచారం.రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఉన్న ఒక చారిత్రక ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరగనుందట. అక్టోబర్ 2025లో దసరా మరుసటి రోజున విజయ్ ఇంట్లో వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని, ఆ సమయంలోనే పెళ్లి ముహూర్తం ఖరారు చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో పెళ్లి వార్తలపై రష్మిక స్పందిస్తూ.. "నేను విజయ్‌నే పెళ్లి చేసుకుంటా" అని సరదాగా వ్యాఖ్యానించిన వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. ఈ జంట తమ బంధాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.