శర్వానంద్ జీవితంలో అంచనాలను పెంచే సీక్రెట్ ట్విస్ట్...!
ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.'కాంతార' చిత్రంతో పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఈ సినిమాలో శర్వానంద్ సరసన నటించబోతోంది. ఇది ఆమెకు తెలుగులో రెండో అవకాశం (మొదటిది ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా).రుక్మిణితో పాటు '8 వసంతాలు' ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది ..'విశ్వం' తర్వాత శ్రీను వైట్ల ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. తన మార్క్ కామెడీతో పాటు పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట.
తెలియని వయసులో ఆవేశంగా చేసిన ఒక పని వల్ల హీరో జీవితంలో ఎలాంటి అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి? అనే ఆసక్తికరమైన ఎమోషనల్ పాయింట్‌తో ఈ సినిమా సాగనుంది.టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri movie Makers) ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 మార్చి నుండి ప్రారంభం కాబోతోంది .. శర్వానంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నారు . ..
శ్రీను వైట్ల కథలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేవి. .శర్వానంద్ వంటి టాలెంటెడ్ హీరోతో ఆయన జతకట్టడం, దానికి మైత్రీ మూవీ మేకర్స్ తోడవ్వడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది .. వింటేజ్ శ్రీను వైట్ల కామెడీ మళ్ళీ ఈ సినిమాతో తిరిగి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ..