చిరంజీవి మూవీకి ఒకే.. చిక్కుల్లో నయనతార..ఏం జరిగిందంటే..?
ఇదే పాలసీ ఎన్నో సినిమాలకు వర్తించేలా చేసింది నయనతార. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి మాత్రం ఆ నిబంధనను పక్కకు పెట్టింది. ఈ విషయమే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి ఆమె ప్రమోషన్స్ వీడియోలో సరదాగా కనిపించడమే కాకుండా స్వయంగా ప్రమోషన్స్ విషయంపై మాట్లాడడంతో తమిళ సినివర్గాల ప్రేక్షకులు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నయనతార తీసుకున్న ఈ నిర్ణయం అటు తమిళ ప్రేక్షకులకు నిర్మాతలకు పెద్దగా నచ్చలేదు.
కోలీవుడ్లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన, కనీసం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించినప్పుడు కూడా కనిపించని నయనతార తెలుగు సినిమా కోసం ఇలా ముందుకు రావడంతో సోషల్ మీడియాలో నయనతార పైన చాలానే విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళ సినిమాలంటే మీకు చులకనగా కనిపిస్తున్నాయా ? అంటూ నయనతార పైన నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తమిళ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలు ఎంత అడిగిన రాకుండా ఇబ్బంది పెట్టిందని, కానీ తెలుగు సినిమాల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తోందని చాలామంది ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయం పైన నయనతార ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాల ప్రమోషన్స్ లో నయనతార పాల్గొంటుందేమో చూడాలి మరి.