మెగా–విక్టరీ కాంబో మాస్ స్టేట్మెంట్.. వెంకీ కామెంట్స్ హైలైట్...!
వెంకటేష్ తన ప్రసంగం మొదలుపెట్టడమే చిరంజీవి గారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. "నేను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే చిరంజీవి గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్ చూసి నేను ఎప్పుడూ ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అలాంటిది ఈ సినిమాలో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం" అని వెంకీ అన్నారు. వీరిద్దరి స్నేహం దశాబ్దాల కాలం నాటిదని, ఈ సినిమాతో అది మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ సుమారు 18 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నారు. ఆ అనుభవం గురించి చెబుతూ వెంకీ ఎమోషనల్ అయ్యారు. "మేమిద్దరం కలిసి చేసిన ఆ 18 రోజులు షూటింగ్ లా అనిపించలేదు.. అది ఒక పెద్ద పార్టీలా, ఒక సెలబ్రేషన్ లా గడిచిపోయింది. చిరంజీవి గారితో సెట్లో ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వేరే లెవల్లో ఉంటాయి. మేమిద్దరం కలిసి చేసిన కామెడీ సీన్స్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తాయి" అని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ‘వింటేజ్ చిరంజీవి’ని పక్కనే ఉండి చూడటం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని వెంకీ చెప్పారు.
దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ.. "అనిల్ రావిపూడికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. ఎక్కడ నవ్వించాలో, ఎక్కడ ఎమోషన్ పండించాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. చిరంజీవి గారిని, నన్ను ఒకే ఫ్రేమ్‌లో జస్టిఫై చేయడం అంత సులభం కాదు, కానీ అనిల్ దాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే ‘టామ్ అండ్ జెర్రీ’ తరహా ఫైటింగ్ సీన్స్ మాస్ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్ లా ఉంటాయి" అని వెంకటేష్ ప్రశంసించారు.
ఈ ఈవెంట్ లో వెంకటేష్ ఒక క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు. "ఈ సినిమాలో మా కాంబినేషన్ చూశాక ప్రేక్షకులు కచ్చితంగా మా ఇద్దరితో ఒక ఫుల్ లెంగ్త్ మూవీ రావాలని కోరుకుంటారు. నేను దానికి ఎప్పుడో రెడీ.. బాస్ (చిరంజీవి) కూడా ఓకే అంటే, అనిల్ రావిపూడి గారు ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకురావాలి" అని అనగానే ఫ్యాన్స్ కేకలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. మెగాస్టార్ కూడా స్టేజ్ మీదే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, త్వరలోనే ఈ ‘మెగా-విక్టరీ’ మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ వెంకటేష్ సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాలకు శుభాకాంక్షలు తెలిపారు. "సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా పండుగ. ప్రభాస్ ‘రాజా సాబ్’, రవితేజ సినిమా, శర్వానంద్ సినిమా.. ఇలా అన్నీ ఆడాలి. ఇండస్ట్రీ బాగుండాలి. మా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మాత్రం మీ అందరికీ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అవుతుంది" అని ధీమా వ్యక్తం చేశారు.
పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ వెంకటేష్ సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాలకు శుభాకాంక్షలు తెలిపారు. "సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా పండుగ. ప్రభాస్ ‘రాజా సాబ్’, రవితేజ సినిమా, శర్వానంద్ సినిమా.. ఇలా అన్నీ ఆడాలి. ఇండస్ట్రీ బాగుండాలి. మా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మాత్రం మీ అందరికీ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అవుతుంది" అని ధీమా వ్యక్తం చేశారు.