ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలలో స్టార్ హీరోల సినిమాలు కూడా చాలానే విడుదల కానున్నాయి. అందులో ఓ విషయంలో కొన్ని సినిమాలతో పోలిస్తే మన శంకర వరప్రసాద్ , అనగనగా ఒక రాజు సినిమాలు ఒక విషయంలో ప్రత్యేకంగా నిలిచాయి అదేంటో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని సినిమాలు కంటే ముందు ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన రాజా సాబ్ మూవీ విడుదల కానుంది. ఈ మూవీలో మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత జనవరి 12 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా విడుదల కానుంది. ఈ మూవీ లో నయనతార హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ మూవీ తర్వాత జనవరి 13 వ తేదీన మాస్ మహారాజా రవితేజ హీరో గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి , ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఇక జనవరి 14 వ తేదీన నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన అనగనగా ఒక రాజు సినిమా విడుదల కానుంది. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. నవంబర్ 14 వ తేదీన శర్వానంద్ హీరోగా రూపొందిన నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదల కానుంది. ఈ మూవీ లో సంయుక్త మీనన్ , సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కానున్న ఈ ఐదు సినిమాల్లో మన శంకర వర ప్రసాద్ గారు , అనగనగా ఒక రాజు ఈ రెండు సినిమాల్లో మాత్రమే ఒక హీరోయిన్ ఉంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి , నారీ నారీ నడుమ మురారి సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండగా రాజా సాబ్ మూవీలో ఏకంగా ముగ్గురు హీరోలు కనిపించబోతున్నారు.