చిరంజీవి నటించిన ఎన్ని సినిమాలు సంక్రాంతికి బ్లాక్‌బస్టర్స్ అయ్యాయో తెలుసా..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇకపోతే చిరంజీవి కెరియర్ లో ఇప్పటి వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమా 1985 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దొంగ మొగుడు మూవీ 1987 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మంచి దొంగ సినిమా 1988 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 1999 వ సంవత్సరం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు , 1993 వ సంవత్సరం ముఠా మేస్త్రి , 1994 వ సంవత్సరం ముగ్గురు మొనగాళ్లు , 1997 వ సంవత్సరం హిట్లర్ , 1999 వ సంవత్సరం స్నేహం కోసం , 2000 వ సంవత్సరం అన్నయ్య , 2017 వ సంవత్సరం ఖైదీ నెంబర్ 150 , 2023 వ సంవత్సరం వాల్టేర్ వీరయ్య సినిమాలతో చిరంజీవి సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు.

ఇకపోతే తాజాగా చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ సంవత్సరం చిరంజీవి "మన శంకర వర ప్రసాద్ గారు" మూవీ తో సంక్రాంతికి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: