వామ్మో: ఒంటిపై దుస్తులు లేకుండా చెట్టేక్కిన స్టార్ హీరో..?

Divya
బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు సంపాదించిన విద్యుత్ జామ్వాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా తన విన్యాసాలతో వార్తల నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా బాడీ ఫిట్నెస్ విషయంలో మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు ఈ నటుడు. తాజాగా ఈ నటుడు ఒక వీడియోలో ఏకంగా నగ్నంగా మారి చెట్టు ఎక్కుతూ కనిపించడంతో ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రకృతి ప్రేమికుడిగా పేరు సంపాదించిన నటుడు విద్యుత్ ఒంటిపైన నూలు పోగు లేకుండా చెట్టు ఎక్కుతూ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది.


అంతేకాకుండా ఎవరో చెట్టు కింద నుంచి మరి ఈ వీడియోని షూట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చెట్టు పైకి వెళ్లిన తర్వాత దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెట్టు పైకి ఎక్కిన హీరో విద్యుత్ మరో సీన్లో ఆయన పూర్తిగా మంచులో కూరుకుపోయి, కళ్ళు మూసుకొని మరి ధ్యానం చేస్తున్నట్లుగా కనిపించడం గమనార్హం. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజెన్స్ సైతం హీరో విద్యుత్ ను ట్రోల్ చేస్తున్నారు. పిచ్చి పట్టిందా? ఇలా నగ్నంగా తిరుగుతున్నావు అంటూ కొంతమంది సిగ్గు లేదా అంటూ దారుణమైన కామెంట్స్ తో ఘాటుగానే విమర్శిస్తున్నారు.


మరి కొంతమంది విద్యుత్ చేసిన ఆలోచనను సమర్థిస్తూ ప్రకృతితో మమేకమవుతున్నారంటూ, ప్రకృతికి ఆయన అంకితం చేసుకుంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరో విద్యుత్ ఎప్పుడూ కూడా తన సినిమాలలో వ్యక్తిగత జీవితంలో కూడా తాను ప్రకృతికి చాలా దగ్గరగానే ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటానని తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన శరీరాన్ని దృఢత్వంగా ఉంచుకోవడానికి,  మానసిక ప్రశాంతత కోసమే తాను తరచూ ఇలాంటి విభిన్నమైన ప్రయోగాలను చేస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం ఏకంగా నగ్నంగా చెట్టు పైకి ఎక్కి కనిపించడంతో అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: