చిరు.. వెంకీ సంక్రాంతికి అన్ని సార్లు తలపడ్డారా..?
1988 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా నటించిన మంచి దొంగ , వెంకటేష్ హీరోగా రూపొందిన రక్త తిలకం సినిమాలు పోటీ పడ్డాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. 1989 వ సంవత్సరం చిరంజీవి హీరోగా నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు , వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమ సినిమాలు పోటీ పడ్డాయి. 1991 వ సంవత్సరం చిరంజీవి హీరోగా నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ , వెంకటేష్ హీరోగా నటించిన శత్రువు సినిమాలు పోటీ పడ్డాయి. 1997 వ సంవత్సరం చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ , వెంకటేష్ హీరోగా రూపొందిన చిన్నబ్బాయి సినిమాలు పోటీ పడ్డాయి. 2000 వ సంవత్సరం చిరంజీవి హీరోగా నటించిన అన్నయ్య , వెంకటేష్ హీరో గా నటించిన కలిసుందాం రా సినిమాలు పోటీ పడ్డాయి. 2001 వ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , వెంకటేష్ హీరోగా నటించిన దేవి పుత్రుడు సినిమాలు పోటీ పడ్డాయి. ఇలా చాలా సార్లు చిరంజీవి , వెంకటేష్ సినిమాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి.