ఇప్పటి జనరేషన్లో మల్టీ స్టారర్ సినిమాలకు బీజం వేసింది ఈ సినిమానే. మల్టీ స్టారర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా మారిన ఈ సినిమా తర్వాత ఎంతోమంది హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఇక ఇప్పటికే ఆ సినిమా ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరు హీరోలుగా.. సమంత, అంజలి లు హీరోయిన్లు గా.. ప్రకాష్ రాజ్,జయసుధ,రావు రమేష్, మురళీమోహన్ లు కీరోల్స్ పోషించిన ఈ సినిమా విడుదలై నేటికి 13 ఏళ్లు పూర్తయింది. 2013లో సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో ఉన్న స్టోరీకి చాలామంది కనెక్ట్ అయ్యి ఎంతమంది కుటుంబ కథా ప్రేక్షకులను అలరించింది.
అయితే అలాంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా విడుదలై 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ విషయం గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుందాం . ఈ సినిమాలో భద్రాచలంలో రాములోరి కళ్యాణం సమయంలో ట్రాన్స్ఫర్ పేలి గందరగోళం నెలకొంటుంది.అయితే క్లైమాక్స్ లో వచ్చిన ఈ సీన్ ని సినిమా లో హీరోలను ఫిక్స్ చేయకముందే ఓ సంవత్సరం ముందే అక్కడికి రాములోరి కళ్యాణం కి వెళ్లి మొత్తం షూట్ చేసుకుని అలాంటి సెట్ రామోజీ ఫిలిం సిటీ లో వేయించి అక్కడి పూజారులని తీసుకువచ్చి దాదాపు 12 రోజులు షూటింగ్ చేశారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఈ సినిమా స్టోరీని ఇద్దరు హీరోలతో చేద్దాం అనుకున్న సమయంలో దిల్ రాజు స్వయంగా మహేష్ బాబుని చెప్పినట్టు శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా మహేష్ నటిస్తున్న దూకుడు మూవీ సెట్ కి తీసుకువెళ్లి మరీ డైరెక్టర్ తో మహేష్ కి కథ చెప్పించారట. ఇక స్టోరీ బాగా నచ్చిన మహేష్ చేస్తానని ఒప్పుకున్నారట.అలాగే ఈ సినిమాలో వెంకటేష్,మహేష్ బాబులకు తండ్రి పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ పాత్ర కోసం మొదట రజినీకాంత్ ని తీసుకుందామని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పగా ఆయన ఒప్పుకోరని దిల్ రాజు అన్నారట.కానీ ఒకసారి ప్రయత్నిద్దాం అని శ్రీకాంత్ అడ్డాల రజినీకాంత్ కి స్టోరీ చెప్పగా..ఆయనకి స్టోరీ బాగా నచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చేయలేకపోయారట. ఈ విషయాలన్నీ ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల పంచుకున్నారు. అలా ఈరోజుకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు మూవీ విడుదలై 13 సంవత్సరాలు పూర్తయింది. ఇక ఈ సినిమా గత ఏడాది మార్చిలో 7 న రీ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే.