రాజా సాబ్: రెండు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?
సోషల్ మీడియాలో మాత్రం మేకర్స్ స్పందిస్తూ హర్రర్ ఫాంటసీ జోనర్లో ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశామని.. ఫస్ట్ డే వరల్డ్ వైజ్ గా రూ.112 కోట్లకు పైగా రాబట్టిందని ఈ జోనర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా ఇదే అంటూ కూడా ప్రకటించారు. అయితే రెండవ రోజు తెలుగు వర్షన్ ఆక్యుపెన్సి 44% నమోదయింది. ఇక హిందీ వర్షన్ లో మాత్రం 12.95% నమోదయింది. తమిళ వర్షన్ లో 21.11% నమోదయ్యింది. అన్నీ కలిపితే మొత్తం మీద రూ.40 కోట్ల గ్రాస్ వసూలు వచ్చినట్లుగా సమాచారం. రాజా సాబ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల రూపాయల వరకు రెండు రోజులలో గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయం పైన చిత్ర బృందం ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.
ఇంత తక్కువలో కలెక్షన్స్ రాబడితే మాత్రం చిత్ర బృందం అంచనాలు అందుకోలేదని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. రాజా సాబ్ సినిమా రూ .200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా కనీసం రూ.400 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. అంతేకాకుండా సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలకు కొంచెం మంచి టాక్ వచ్చిన ఖచ్చితంగా ఆ సినిమాల ఎఫెక్ట్ రాజా సాబ్ సినిమా మీద పడుతుంది.