మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్.. సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్..!
సినిమా చూసిన అభిమానులు కూడా మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ అని సంక్రాంతి విన్నర్ బాస్ ఇస్ బ్యాక్ అంటూ నేటిజన్స్ రివ్యూలతో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి తన యాక్టింగ్ తో అదరగొట్టేసారని ,డైరెక్టర్ అనిల్ రావిపూడి టేకింగ్ కూడా అద్భుతంగా ఉందని నయనతార నటన వెంకటేష్ కామెడీ ఇలా అన్నీ కూడా సినిమాకి బాగా కలిసి వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు. సుస్మిత కొణిదెల , నిర్మాత సాహూ గారపాటి, అనిల్ రావిపూడి వెళ్లి మరి చిరంజీవికి కేక్ కట్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అధికారిక ట్విట్టర్ ద్వారా ఫోటోలను షేర్ చేశారు.
మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవిని ఎలా వాడుకోవచ్చో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసి చూపించారు. వెంకటేష్ ఉన్నది కేవలం 20 నిమిషాలైనా కూడా అదరగొట్టేశారు. నయనతార తన అందంతో పాటు యాక్టింగ్ తో కూడా మరొకసారి తనని తాను ప్రూఫ్ చేసుకుంది. ఇక మిగిలిన యాక్టర్స్ కూడా ఎవరికి వారు తమ యాక్టింగ్ తో తమ పాత్రలకు న్యాయం చేశారు. భీమ్స్ అందించిన మ్యూజిక్ పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి మరొకసారి తన రైటింగ్ పవర్ ఏంటో చూపించారు. పాత కథ తీసుకున్నప్పటికీ దానిని ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో చూపించే విధానంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.