మన శంకరవరప్రసాద్ గారు ఓటిటిలోకి వచ్చేది అప్పుడే..?

Divya
ఈ ఏడాది(2026) సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో మన శంకరవరప్రసాద్ గారు సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నేడు (జనవరి 12) న థియేటర్లో విడుదలవ్వగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. చిరంజీవికి జోడిగా నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగా ఆభిమానులను అయితే ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది.



ఇటీవల కాలంలో ఏ సినిమాలు ఏ ఓటిటిలోకి రాబోతున్నాయనే విషయాన్ని సినిమా స్క్రీన్ మీద చెప్పేస్తున్నాయి. మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఓటిటి రైట్స్, శాటిలైట్ పార్ట్నర్  కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు చిత్రాన్ని ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లలో ఒకటైన  Zee -5 ఓటీటి కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా శాటిలైట్ హక్కులను కూడా ఈ సంస్థే దక్కించుకుంది. ఎలాంటి సినిమా అయినా సరే విడుదలైన 30 నుంచి 40 రోజులలోపు ఓటీటిలోకి వచ్చేస్తోంది. ఈ లెక్కన చూస్తే ఫిబ్రవరి నెలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని, చిరంజీవి కం బ్యాక్ అంటూ పలువురు అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి వేసిన హుక్ స్టెప్ సాంగ్ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తుకు చేస్తున్నాయని, చిరంజీవి నయనతార మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయని అలాగే బుల్లి రాజు కూడ తన కామెడీతో మరొకసారి చెలరేగిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. వెంకీ మామ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ లో మారిపోయిందని తెలుపుతున్నారు. మరి ఈ సంక్రాంతికి ఎలాంటి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి మరి మెగాస్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: