చిరంజీవి అల్లు అరవింద్ ల మధ్య బాండింగ్ ఎంత బాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొడుకుల మధ్య పోటీ ఉన్నప్పటికీ బావా బామ్మర్దులు మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటారు.గతంలో అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి పడడం లేదు అన్న సమయంలో కూడా అల్లు అరవింద్ చిరంజీవితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొని అదంతా ఉత్తి ట్రాష్ అంటూ జనాల్లోకి ఒక భావన వెళ్లేలా చేశారు. అలా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో అంటీ ముట్టనట్లుగా ప్రవర్తిస్తున్నప్పటికీ అల్లు అరవింద్ మాత్రం తన బావ గారితో ఎప్పటికీ దగ్గరగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి వెళ్లి అల్లు అరవింద్ తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చారు. మరి ఇంతకీ చిరంజీవి సినిమా పై అల్లు అరవింద్ ఇచ్చిన రివ్యూ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
చాలా మంది సెలబ్రెటీలు సినిమాలు విడుదలైన సమయంలో ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్తూ ఉంటారు. అలా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలైన సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం థియేటర్లో సినిమా చూసి ఆనందించారు. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ కూడా థియేటర్లో సినిమా చూసి అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. అల్లు అరవింద్ థియేటర్ నుండి బయటకు రాగానే కొంతమంది మీడియా వాళ్ళు సినిమా ఎలా ఉంది.. మీ ఫీలింగ్ ఏంటి అని ప్రశ్నించగా.. సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమా చూసి వస్తుంటే చాలా ఎక్జైటింగ్ గా అనిపిస్తుంది. బాస్ ఈ సినిమాలో చించి పారేశారు.. బాస్ ఈజ్ బాస్ అంతే.. ఈ సినిమా చూస్తుంటే అప్పటి పాత రోజులు గుర్తుకు వస్తాయి.ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు సినిమా డేస్ గుర్తుకు వస్తాయి.
సినిమా చూస్తున్నంత సేపు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. డాన్స్,బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయి. వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ అనిపించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ ఏ లెవెల్ లో ఆలోచించారో అర్థం అయింది అంటూ చిరంజీవి సినిమాపై అద్భుతమైన రివ్యూ ఇచ్చారు.అలాగే అతిథి పాత్రలో మెప్పించిన వెంకటేష్ గురించి మాట్లాడుతూ.. వెంకటేష్ ఎంట్రీనే అదిరిపోయింది. కాంబినేషన్, క్లైమాక్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి . సినిమా చూస్తుంటే జనాలకు పైసా వసూల్ ఫీలింగ్ వస్తుంది అంటూ అదిరిపోయేది రివ్యూ ఇచ్చారు అల్లు అరవింద్. ప్రస్తుతం అల్లు అరవింద్ సినిమా గురించి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..