"మన శంకర వరప్రసాద్ గారు" స్క్రిప్ట్ లో వేలు పెట్టి మొత్తం చెడగొట్టిన చిరంజీవి..!

Pandrala Sravanthi
కొంతమంది హీరోలు సినిమా స్క్రిప్ట్ లో వేలు పెడుతూ దర్శకులకు తలనొప్పిగా మారుతూ ఉంటారు. డైరెక్టర్ల పని డైరెక్టర్లను చేసుకొనివ్వకుండా అక్కడక్కడ వేలు పెడుతూ ఉంటారు. అయితే తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా స్క్రిప్ట్ లో కూడా చిరంజీవి వేలు పెట్టారని,చిరంజీవి వేలు పెట్టిన సీన్స్ మైనస్ అయ్యాయని,ఈ సీన్స్ విషయంలో చిరంజీవి గనుక వేలు పెట్టకపోయి ఉంటే డైరెక్టర్ ఆలోచనతోనే సినిమా వచ్చి ఉంటే మరింత అద్భుతంగా ఉండేదని కొంతమంది సినీ విశ్లేషకులు అంటున్నారు.మరి ఇంతకీ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని ఏ సీన్లలో వేలు పెట్టారు అనేది కూడా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి అతిథి పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే.


అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లు డైరెక్టర్ మొదట వేరే రాసుకున్నారట. కానీ వాటిని మార్చమని చిరంజీవి స్క్రిప్ట్ లో వేలు పెట్టేసరికి అంత పెద్ద హీరో చెప్పడంతో అనిల్ రావిపూడి చేసేదేమీ లేక తాను అనుకున్న సీన్స్ పక్కన పెట్టి చిరంజీవి చెప్పిన సీన్స్ యాడ్ చేశారట. అలా మొదట వెంకటేష్ ని గెస్ట్ రోల్ లో అనుకోలేదట. ఈ విషయంలో చిరంజీవి కల్పించుకొని వెంకటేష్ ని గెస్ట్ రోల్ లో తీసుకోమని చెప్పడం వల్లే అనిల్ రావిపూడి తాను మొదట రాసుకున్న స్క్రిప్ట్ పక్కనపెట్టి వెంకటేష్ అతిథి పాత్ర కోసం సీన్స్ రాసుకున్నారట. అయితే మొదట అనిల్ రావిపూడి ఈ సినిమా సెకండ్ హాఫ్ లో హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేస్తూ విలన్ పాత్రను కూడా ఎక్కువ చేసి రాసుకున్నారట.


కానీ చిరంజీవి ఈ విషయంలో వేలు పెట్టి వెంకటేష్ నీ తీసుకొని ఆయన పాత్రకి సీన్స్ రాయమని చెప్పారట.దీంతో అనిల్ తాను అనుకున్న సీన్స్ పక్కన పెట్టేసి చిరంజీవి చెప్పినదాని ప్రకారం ఫాలో అయ్యారట. అయితే ఈ సినిమా హిట్ క్రెడిట్ వెంకటేష్ కి కూడా వెళ్ళిపోయింది.ఎందుకంటే ఈ సినిమాలో వెంకటేష్ వచ్చిన 20 నిమిషాలు సినిమా మరో లెవెల్ కి వెళ్ళిపోయింది. ఒకవేళ చిరంజీవి ఈ సినిమా స్క్రిప్ట్ లో వేలు పెట్టక అనిల్ రావిపూడి రాసుకున్న స్క్రిప్టే అమలు చేసి ఉంటే సినిమా హిట్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్,హీరోకి మాత్రమే వచ్చేది.కానీ చిరంజీవి వెంకీని తీసుకువచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిద్దాం అని చెప్పడం వల్లే డైరెక్టర్ తన స్క్రిప్ట్ ని మార్చేశారట.ఈ విషయంలో కొంత చిరంజీవికి మైనస్ అని చెప్పుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: