నార్త్ అమెరికా లో హైయెస్ట్ కలెక్షన్ల ను రాబట్టి న టాప్ 10 ఇండియన్ మూవీస్ ఏవో తెలుసు కుందాం.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 నార్త్ అమెరికాలో 22 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక బాలీవుడ్ నటుడు రన్వీర్ సింగ్ హీరో గా రూపొందిన దురంధర్ మూవీ ఇప్పటికీ 38 రోజుల బాక్సాఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని 38 రోజుల్లోనే ఈ సినిమా 20.04 మిలియన్ కలెక్షన్లను రాబట్టింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 18.57 మిలియన్ కలెక్షన్లను రాబట్టింది. షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన పటాన్ మూవీ 17.48 మిలియన్ కలెక్షన్లను రాబట్టింది.
రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 15.34 మిలియన్ కలెక్షన్లను రాబట్టగా ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ 15.34 మిలియన్ కలెక్షన్లను రాబట్టింది. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ మూవీ 15.23 మిలియన్ కలెక్షన్లను రాబట్టింది. రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ మూవీ 15.01 మిలియన్ కలెక్షన్లను రాబట్టింది. అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన దంగల్ మూవీ 12.39 మిలియన్ కలెక్షన్లను రాబట్టింది. పద్మావత్ మూవీ 12.7 మిలియన్ కలెక్షన్లను రాబట్టింది. ఇలా నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మూవీల లిస్టులో ఈ పది సినిమాలు నిలిచాయి. ఇకపోతే దురందర్ సినిమా మరికొన్ని కలక్షన్లను వసూలు చేసి మొదటి స్థానం లోకి వెళ్లే అవకాశాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి.