అలాంటోడే నా భర్త.. హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్..!

Divya
టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించిన మీనాక్షి చౌదరి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. గత ఏడాది సంక్రాంతి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా నవీన్ పోలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు ప్రమోషన్స్ లో కూడా మీనాక్షి చౌదరి హైలెట్గా నిలిచింది. ప్రమోషన్స్ లో తన కాబోయే భర్త గురించి కొన్ని విషయాలు తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.



మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తనకి కాబోయేవాడు డాక్టరు లేదా నటుడు, మిస్టర్ ఇండియా అసలు అవ్వకూడదని తేల్చి చెప్పింది. తాను ఇప్పటికే మూడు రంగాలలో ఉన్నాను కాబట్టి , తన ఇంట్లో అలాంటి వ్యక్తి అవసరం లేదని అంతేకాకుండా తన భర్తకు 100 ఎకరాల పొలం ఉండాలని ఇంటి పనులైన ,వంట పనులు, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం వంటివి తెలిసి ఉండాలి అంటు సరదా కండిషన్స్ ని తెలియజేసింది. అబ్బాయికి ఎలాంటి బ్రేకప్స్ ఉన్న పర్వాలేదు కానీ పొడవుగా ఉంటూ రోజుకి రెండు మూడు సార్లు లవ్ ప్రపోజ్ చేస్తూ గిఫ్ట్ ఇచ్చేవాడే తన రాజు అంటూ తెలియజేసింది.


ఈసారి సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి కామెడీతో మీనాక్షి చౌదరి గ్లామర్ తో సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమంటూ అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా టాలీవుడ్ హీరోలతో మీనాక్షి చౌదరి ప్రేమలో ఉందని రూమర్స్ వినిపించాయి. అయితే వాటన్నిటినీ కూడా ఈ ముద్దుగుమ్మ కొట్టి పారేసింది. మీనాక్షి చౌదరి సినిమాల విషయానికి వస్తే.. విక్రమ్ 63 వ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తమిళంలో వృషకర్మ అనే చిత్రంలో నటిస్తోంది. మరి ఈ ఏడాదికి సంక్రాంతికి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: