గత సంక్రాంతి సంచలనం ‘డాకు మహారాజ్’.. OSTపై థమన్ సాలిడ్ అప్డేట్!
బాలయ్య-థమన్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ బ్లాస్ట్. 'అఖండ', 'వీరసింహారెడ్డి' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సౌండ్ పొల్యూషన్ చేసిన ఈ జోడి, 'డాకు మహారాజ్'తో ఆ స్థాయిని మరింత పెంచింది. సినిమాలో వచ్చే ప్రతి ఎలివేషన్ సీన్ కి థమన్ ఇచ్చిన బీజీఎం థియేటర్లను దద్దరిల్లజేసింది. ముఖ్యంగా బాలయ్య ఎంట్రీ సీన్ మరియు ఇంటర్వెల్ ఫైట్ సమయంలో వచ్చే మ్యూజిక్ ఇప్పటికీ ఫ్యాన్స్ చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఇప్పుడు ఆ స్కోర్ మొత్తాన్ని హై-క్వాలిటీలో OST రూపంలో విడుదల చేస్తుండటంతో, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ ఊపును ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించారు. ఒకటి కుర్రాడిగా రఫ్ లుక్ లో, మరోటి సీనియర్ బాలయ్యగా తన మార్క్ గ్రేస్ తో అదరగొట్టారు. దర్శకుడు బాబీ ప్రతి ఫ్రేమ్ ను బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా మలిచారు. బాబీ డియోల్ విలనిజం, శ్రద్ధా శ్రీనాథ్ - ప్రగ్యా జైస్వాల్ ల పెర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచాయి. గతేడాది సంక్రాంతికి క్లాష్ ఉన్నప్పటికీ, 'డాకు మహారాజ్' మాస్ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
చాలా సినిమాలకు సాంగ్స్ హిట్ అవుతాయి కానీ, కొన్ని సినిమాలకు మాత్రమే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తారు. 'డాకు మహారాజ్' ఆ కోవకు చెందిన సినిమా. థమన్ ఈ సినిమా కోసం ఆఫ్రికన్ బీట్స్ మరియు పక్కా మాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు. సినిమా చూస్తున్నప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కి ఫ్యాన్స్ థియేటర్ లో పేపర్లు చించి విసిరారు. ఇప్పుడు ఆ OST బయటకు వస్తే, అది యూట్యూబ్ లో వ్యూస్ పరంగా రికార్డులు సృష్టించడం ఖాయం.బాలయ్య సినిమాలకు సీజన్ తో సంబంధం లేదు.. ఆయన ఎప్పుడు వచ్చినా సంక్రాంతే! గతేడాది పండుగను 'డాకు మహారాజ్' తో సెలబ్రేట్ చేసుకున్న ఫ్యాన్స్, ఇప్పుడు థమన్ ఇచ్చే మ్యూజికల్ ట్రీట్ తో మరోసారి ఆ వైబ్ లోకి వెళ్ళబోతున్నారు.