వామ్మో! సాయి పల్లవి నిజంగానే సినిమాలకి గుడ్ బై చెప్పి ఆ పని చేస్తుందా?

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆ వార్త ఏమిటంటే… ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి ఇకపై సినిమాల నుంచి కాస్త దూరంగా ఉండబోతున్నారట. ఈ వార్త నిజమా కాదా అన్నది ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా, అభిమానులు మాత్రం ఈ విషయం విని ఆశ్చర్యానికి గురవుతున్నారు.సాయి పల్లవి ఒక డాక్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే ఆమె వైద్య విద్య పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే ఆమెకు డాన్స్ అంటే ఎంతో ఇష్టం. అదే ఇష్టమే ఆమెను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వైపు నడిపించింది. డాన్స్ ద్వారా వచ్చిన అవకాశాలే ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చాయి. అయితే, మొదటి నుంచే ఆమెకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని పలుమార్లు చెప్పుకొచ్చింది. అయినా కూడా, తన ప్రతిభ, సహజ నటన, డాన్స్ స్కిల్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

ఇప్పుడు విషయం ఏమిటంటే… సాయి పల్లవి తన డాక్టర్ వృత్తిపై మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఇటీవల ఆమె వద్దకు వచ్చిన పలువురు దర్శకులు ఇచ్చిన సినిమా ఆఫర్లను ఆమె తిరస్కరిస్తోందని టాక్. అంతేకాదు, మంచి కథ, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకూ కూడా ఆమె “నో” చెబుతోందట.దీనికి కారణం ఏమిటి అని ఆరా తీస్తే, ఆమె తన చదువుకున్న విద్యకు విలువ ఇవ్వాలని, తన వైద్య పరిజ్ఞానం సమాజానికి ఉపయోగపడాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉందని సమాచారం. అదే కారణంగా ఆమె ప్రస్తుతం కొత్త సినిమాలకు కమిట్ అవ్వకుండా దూరంగా ఉంటోందట.

ఇక్కడ ప్రధానంగా అభిమానులను కలవరపెడుతున్న ప్రశ్న ఒక్కటే —సాయి పల్లవి ఇక పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారా? లేదా కొంతకాలం మాత్రమే విరామం తీసుకోబోతున్నారా?దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. సాయి పల్లవి నుంచీ, ఆమె టీమ్ నుంచీ కూడా అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతూ హీట్ పెంచుకుంటోంది. అభిమానులు ఒకవైపు గర్వంగా ఫీలవుతుండగా, మరోవైపు ఆమె సినిమాలకు దూరమైతే మిస్ అవుతామేమో అన్న భావనతో ఆందోళన చెందుతున్నారు.ఏదేమైనా, నటిగా ఎంత గొప్పగా నిలిచిందో, ఒక డాక్టర్‌గా కూడా సాయి పల్లవి తన బాధ్యతను గుర్తించి ముందుకు సాగడం నిజంగా అభినందనీయం. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం నిజమైతే, అది ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఇక చివరికి అసలు నిజం ఏమిటో సాయి పల్లవి అధికారికంగా వెల్లడించే వరకు వేచిచూడాల్సిందే..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: