రెండు రోజుల్లోనే "బుక్ మై షో"లో ఆ రేర్ మార్క్ ను టచ్ చేసిన మన శంకర వరప్రసాద్ గారు..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. నయనతార ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్ల పై సాహు గారపాటి , సుష్మిత కొణిదల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ కి బీమ్స్ సిసిరిలీయో సంగీతం అందించాడు. ఈ సినిమాను జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 11 వ తేదీన రాత్రి నుండే చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు.


ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు కూడా అద్భుతమైన ఓపెనింగ్లు లభించాయి. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో అద్భుతమైన సేల్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో ఏకంగా 1 మిలియన్ సేల్ అయినట్లు తెలుస్తోంది.


ఇలా రెండు రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో 1 మిలియన్ సేల్ అయ్యాయి అంటేనే అర్థం అవుతుంది ఈ మూవీపై ప్రేక్షకులు ఏ స్థాయిలో రెస్పాన్స్ చూపిస్తున్నారు అనేది. ఇకపోతే ఈ మూవీ కి ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలిపి అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి రెండవ రోజు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో రెండవ రోజు కూడా ఈ మూవీ కి పెద్ద స్థాయిలో కలెక్షన్లు దక్కి ఉంటాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ కి మంచి టాక్ రావడం , ఈ సినిమాకి మంచి కలెక్షన్లు దక్కుతూ ఉండడం తో ఈ మూవీ భారీ ఎత్తున లాభాలను అందుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: