ఆ విషయంలో "మన శంకర్ వరప్రసాద్ గారు" తగ్గితేనే మంచిదా.. లేకపోతే కష్టమే.?
ఇక సినిమా బాగుందని తెలియడంతో చాలామంది కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు.కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం వణికి పోతున్నారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలనుకునే వారిని టికెట్ రేట్లు భయపెడుతున్నాయి. ఇదే సమయంలో థియేటర్లలోకి ది రాజా సాబ్ రీ వెర్షన్ కూడా వచ్చింది. ఈ చిత్రం కూడా బాగుందని టాక్ వినిపిస్తోంది.కానీ ఈ సినిమా టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారుతో పోలిస్తే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడాలనుకునే వారు ఈ సినిమాకి మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. మరో పక్క పండగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాను దాటి రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా దూసుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇదే సమయంలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా యాజమాన్యాలు ఏమైనా టికెట్ ధరలు తగ్గిస్తే మాత్రం సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. లేదంటే ఆ రికార్డు రవితేజ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాకు సంబంధించి ఏమైనా టికెట్ ధరలు తగ్గిస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు చూస్తే సింగిల్ స్క్రీన్ లో జిఎస్టి తో కలిపి 50 రూపాయలు.. మల్టీప్లెక్స్ లో జిఎస్టి తో కలిపి ₹100 ఉంది. అయితే ఈ ధరలు జనవరి 22 వరకు ఇలాగే కొనసాగుతాయి. ఒకవేళ ధరలు తగ్గిస్తే మాత్రం చిరంజీవి సినిమా మరిన్ని రికార్డులు సాధించి సంక్రాంతి బరిలో హైలెట్గా నిలుస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.