బాహుబలి కోసం ప్రభాస్ కి పెట్టిన "ఆ" కండీషన్ నే ..వారణాసి కోసం మహేశ్ కి పెట్టిన రాజమౌళి..!?
ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది.‘బాహుబలి’ సినిమాకి ప్రభాస్‌కు రాజమౌళి పెట్టిన కఠినమైన కండీషన్‌లే ఇప్పుడు ‘వారణాసి’ కోసం మహేష్ బాబుకూ పెట్టాడట అనే టాక్ బాగా ట్రెండ్ అవుతోంది.‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ తన జీవితాన్నే అంకితం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు రెండేళ్లకు పైగా ఆయన పూర్తిగా రాజమౌళి చెప్పిన నియమాలకు లోబడి జీవించాడు. డైట్, జిమ్, నిద్ర, షూటింగ్, ఫిజికల్ ట్రైనింగ్—అన్నీ ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్‌లో జరిగాయి. ఒక్క రోజు కూడా ఆ రొటీన్ నుంచి తప్పుకునే అవకాశం లేదు.ఆ కఠినమైన డిసిప్లిన్ వల్లే ప్రభాస్ ఒక సాధారణ హీరో నుంచి పాన్-ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ‘బాహుబలి’ ఆయన కెరీర్‌ను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లింది.ఇప్పుడు అదే తరహా డిసిప్లిన్‌ను రాజమౌళి మహేష్ బాబుపై కూడా అమలు చేస్తున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిజానికి మహేష్ బాబు ఎప్పటి నుంచో తన ఫిట్‌నెస్, డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. కానీ ‘వారణాసి’ కోసం మాత్రం రాజమౌళి ఇంకా స్పెషల్ డైట్ ప్లాన్, ఫిజికల్ ట్రైనింగ్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి వాటిని డిజైన్ చేశాడట.
ఫ్యాన్స్ మధ్య వినిపిస్తున్న సరదా మాట ఏంటంటే…“బాహుబలి కోసం ప్రభాస్ రెండేళ్లు డైట్ ఫాలో అయ్యాడు… కానీ ‘వారణాసి’ కోసం మహేష్ బాబు అంతకంటే ఎక్కువ కాలం, ఇంకా కఠినమైన లెవెల్‌లో డైట్ ఫాలో అవ్వాల్సి వస్తుందట” అని. రాజమౌళి సినిమా అంటే అది ఒక సాధారణ కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు. అది ఒక మిషన్ లాంటిది. హీరో నుంచి టెక్నీషియన్ వరకూ ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని కొంతకాలం ఆ సినిమాకే అంకితం చేయాలి. అందుకే ఆయన సినిమాలు ఇండియన్ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.ఇప్పుడు అదే మాయాజాలాన్ని మహేష్ బాబు – ‘వారణాసి’ ద్వారా మరోసారి చూపించబోతున్నాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చినట్లే, ఈ సినిమా మహేష్ బాబును గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తుందని చాలామంది ఆశిస్తున్నారు.ఈ వార్తలు ఎంతవరకు నిజమో అధికారికంగా తెలియాల్సి ఉన్నప్పటికీ, ఒక విషయం మాత్రం ఖచ్చితం— రాజమౌళి + మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఇండియన్ సినిమా చరిత్రలో మరో బిగ్గెస్ట్ మైలురాయి రాబోతోంది.