బాక్సఫీస్ ను దంచి కొట్టిన మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి నయనతార హీరోయిన్గా నటించగా ... బీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందించాడు.


షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహూ గారపాటి , సుస్మిత కొణిదల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 11 వ తేదీన రాత్రి అనేక ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ సినిమాకు ప్రీమియర్ షో ల ద్వారా మంచి టాక్ వచ్చింది. దానితో మొదటి రోజు ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. అలాగే రెండవ రోజు కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు దక్కాయి అనే వివరాలను తెలియ జేస్తూ ఈ మూవీ బృందం పోస్టర్ విడుదల చేసింది.
 


తాజాగా ఈ మూవీ బృందం వారు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కి 120 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి కలక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: