రాజా సాబ్ : హిట్టుకి ఏకంగా అన్ని కోట్ల దూరంలో.. ఇప్పటివరకు వచ్చింది అంతే..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ది రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులు అయినటువంటి నిధి అగర్వాల్ , రీద్ధి కుమార్ , మాలవిక మోహన్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి ఈ సినిమాకి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్లు దక్కాయి. ఆ తర్వాత నుండి ఈ సినిమా కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 68.03 కోట్ల షేర్ ... 98.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 102.98 కోట్ల షేర్ ... 169.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 29 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 106.02 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని హిట్టు స్టేటస్లు అందుకుంటుంది. మరి ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: