సంక్రాంతి మూవీస్: చిరంజీవిని ఢీ కొట్టేవాడే లేడా..?

Divya
టాలీవుడ్లో సంక్రాంతి అంటే సినిమాల పండుగగా మారుతుంది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల అలరిస్తుంటాయి. అలా ఈ ఏడాది ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా ,చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు, రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతికి మాత్రం అనిల్ రావిపూడి, మెగాస్టార్ కాంబినేషన్లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమానే హైలెట్గా నిలిచినట్లు వినిపిస్తోంది.


సినిమా థియేటర్ల వద్ద భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఒక్క రోజులోనే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15 కోట్ల వరకు రాబట్టింది. ఈ సంక్రాంతి రేసులో ఉన్న ఇతర చిత్రాలు సైతం కనీసం రూ .4కోట్ల మార్కును కూడా దాటలేకపోతున్నాయి. ఈ రోజే కాకుండా రేపటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కూడా రూ.10 కోట్ల రూపాయల టికెట్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయని ,డిమాండ్ ను బట్టి అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా షోలు భారీగా పెంచేస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ సినిమా మానియా ఎలా ఉందో ఊహించుకోవచ్చు.


చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 , వాల్తేరు వీరయ్య చిత్రాలు సంక్రాంతికి విన్నర్గా నిలిచాయి. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. దీంతో సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమా ఉందంటే మిగిలిన సినిమాలకు పోటీ ఇచ్చే అవకాశాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించేలా కనిపిస్తోంది. సినిమాకి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్, డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ చూసిన ప్రేక్షకులను మళ్లీమళ్లీ థియేటర్ కు వెళ్లి చూడాలనిపించేలా చేస్తోంది. 2026 సంక్రాంతి విజేతగా మెగాస్టార్ సినిమానే నిలిచిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి కలెక్షన్స్ పరంగా ఫైనల్ గా ఎవరు ఎలాంటి రికార్డులను తిరగా రాస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: