సంక్రాంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే చాలు..సిరిసంపదలే..?

Divya
సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. అయితే సంక్రాంతిని (భోగి, మకర సంక్రాంతి, కనుమ) జరుపుకుంటారు. హిందూ ధర్మంలో మకర సంక్రాంతికి చాలా విశిష్టత కలదు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ పుణ్య స్నానాలు చేసి ,దానధర్మాలు చేస్తే ఆ ఇంటిల్లిపాది వంద రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని పండితు సైతం తెలియజేస్తున్నారు.


అందులో ఒకటి నల్లటి నువ్వులు:
ఇవి శని దేవుడికి చాలా ఇష్టం వీటిని దానం చేయడం వల్ల ఏలి నాటి శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా సూర్యుడికి నువ్వులు  సమర్పించడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి.

బెల్లం దానం:
సూర్య భగవానుడికి ఇష్టమని చెబుతూ ఉంటారు. బెల్లం దానం చేయడం వల్ల జాతకం లో సూర్యుని బలం పెరుగుతుంది. దీంతో గౌరవం ,కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


ధాన్యం దానం:
బియ్యం లేదా పప్పులు కలిపి ఇచ్చిన లేదా కిచిడి వంటి పదార్థాన్ని దానం చేసిన ఆ ఇంటిల్లిపాది ధనధాన్యాలకు ఎప్పుడు లోటు ఉండదు. అంతేకాకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి వీరుస్తాయి.


దుస్తుల దానం:
బట్టలు దానం చేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనే పురాణాలలో చెబుతున్నాయి. దీనివల్ల దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి.


ఆవు నెయ్యి:
ఆవు నెయ్యిని లక్ష్మీ స్వరూపంగా అందరం భావిస్తాము అందుకే ఆవు నెయ్యిని దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి , అభివృద్ధి చెందుతారు.ఆవుని పూజించడం కూడా మంచిది.


అన్నం దానం:
పండుగ రోజున కనీసం ఇద్దరు లేదా ముగ్గురికి అన్నదానం  చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.


పండుగ అంటే కేవలం పిండి వంటలను చేసుకుని తినడమే కాదు. వచ్చిన వారికి సహాయం చేయడం వల్ల  భగవంతుని కృప లభిస్తుందని పండితులు సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: