ఈ సంక్రాంతి సినిమాల విషయంలో ఆ నిర్మాతలు ఈ తప్పు చేయాల్సింది కదా..?

Pulgam Srinivas
సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు అనేక తెలుగు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా చాలా పెద్ద మొత్తంలో సంక్రాంతి పండుగకు సినిమాలు విడుదల కావడానికి ప్రధాన కారణం తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి సమయంలో సినిమాలు చూడడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. దానితో చాలా సినిమాలు సంక్రాంతి సమయంలో విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే దాదాపుగా సంక్రాంతి సీజన్ లో మూడు నాలుగు సినిమాలు విడుదల అయినా కూడా అందులో రెండు , మూడు సినిమాల వరకు మంచి కలెక్షన్లను అందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి నాలుగు సినిమాల కంటే ఎక్కువ సినిమాలు విడుదల అయ్యి వాటిలో చాలా ఎక్కువ సినిమాలకు మంచి టాక్ వచ్చినట్లయితే మంచి టాక్ వచ్చిన సినిమాలకు కూడా కలెక్షన్లు తగ్గే ప్రభావం చాలా వరకు ఉంటుంది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా ఐదు తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి.


ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటగా ప్రభాస్ హీరోగా రూపొందిన రాజా సాబ్ విడుదల కాగా , ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు  ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన అనగనగా ఒక రాజు ఆ తర్వాత శర్వానంద్ హీరోగా రూపొందిన నారి నారి నడుమ మురారి సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సినిమాలలో రాజా సాబ్ మూవీ ని మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చింది. దానితో చాలా మంది ఈ సారి ఐదు సినిమాలు విడుదల అయితే అందులో నాలుగు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. దానితో మంచి టాక్ వచ్చిన సినిమాలకు కూడా ఆ స్థాయి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండే ఛాన్స్ తక్కువగా ఉన్నాయి. ఇందులో ఒకటి లేదా రెండు సినిమాల నిర్మాతలు సంక్రాంతి సీజన్ లో కాకుండా వారి సినిమాలను వేరే తేదీలలో విడుదల చేసి ఉంటే ఆ మూవీలకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చేవి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: