అనగనగా ఒక రాజు మూవీతో రేర్ రికార్డు కొట్టిన మీనాక్షి చౌదరి..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. ఇప్పటివరకు చాలా తెలుగు సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ రేర్ రికార్డును కొట్టేసింది. అది ఎందులో అనుకుంటున్నారా ..? సంక్రాంతి సినిమాల విషయంలో. దాదాపు మన తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతికి తమ సినిమాలను దించే విషయంలో హీరోలు , దర్శకులు , నిర్మాతలు కాస్త ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా హీరోయిన్ల సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ మీనాక్షి చౌదరి నటించిన సినిమాలు గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల అవుతూ వస్తున్నాయి. 2024 వ సంవత్సరం ఈ ముద్దుగుమ్మ నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 2025 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ బ్యూటీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయింది.


ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా 2026 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ బ్యూటీ నటించిన అనగనగా ఒక రాజు అనే సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకి సూపర్ సాలిడ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. దానితో ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. దానితో వరుసగా మూడు సంవత్సరాలు సంక్రాంతి పండుగకు తన సినిమాలతో ప్రేక్షకులను పలకరించి మూడింటితో విజయాలను అందుకునే రేర్ రికార్డును ఈ బ్యూటీ సొంతం చేసుకుని అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc

సంబంధిత వార్తలు: