రెండు రోజుల్లోనే ఆ రేర్ ఫీట్ను కంప్లీట్ చేసిన మన శంకర వరప్రసాద్ గారు..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ... నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహు గారపాటి , సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు బీమ్స్ సిసిరిలీయో సంగీతం అందించాడు. ఈ మూవీ కి అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ లో 50% వెనక్కి తెచ్చుకుంది. రెండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

రెండు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 14.03 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 6.51 కోట్లు , ఉత్తరాంధ్ర లో 5.73 కోట్లు , ఈస్ట్ లో 4.66 కోట్లు , వెస్ట్ లో 3.84 కోట్లు , గుంటూరు లో 4.47 కోట్లు , కృష్ణ లో 3.20 కోట్లు , నెల్లూరులో 2.36 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో ఈ మూవీ కి 44.8 కోట్ల షేర్ ... 68 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక రెండు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 3.90 కోట్లు , ఓవర్సీస్ లో 12.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 61.45 కోట్ల షేర్ ... 100.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 120.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 122 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఈ సినిమా మరో 60.55 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: