అనగనగా ఒక రాజు సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్..ఎన్ని కోట్లంటే..?
విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ .22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబడినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అనగనగా ఒక రాజు చిత్రం సుమారుగా రూ .30 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ .60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కాబట్టి అందులో పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా ఈజీగా అందుకుంటుదని అభిమానులు భావిస్తున్నారు.
చిత్ర బృందం కూడా ఈ సినిమా రూ .100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ కూడా మంచి మౌత్ టాక్ రావడంతో కొన్నిచోట్ల థియేటర్లు దొరకగా ఎగ్జిబిటర్లకు ఇబ్బందిగా మారుతున్నట్లు వినిపిస్తున్నాయి. ప్రతి సినిమాకి కూడా ప్రేక్షకుల ఆదరణ ఉండడంతో డిమాండ్ తగ్గట్టుగానే షోలు పెంచడం ఎగ్జిక్యూటర్లకు సాధ్యమయ్యేలా కనిపించడం లేదట. ముఖ్యంగా కొన్నిచోట్ల తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయినా కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో సంక్రాంతి విన్నర్ ఎవరని చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.