“ఓరి దుర్మార్గుల్లారా.. కావాలనే ఆ రెండు సినిమాలను తొక్కేస్తున్నారా?”
ఆ తరువాత మనసంకర వరప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేష్ కీలక పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు మొదటినుంచే “సూపర్ డూపర్ హిట్” అనే టాక్ వచ్చింది. అయితే, కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదని అభిప్రాయపడుతున్నారు. కానీ పీఆర్ టీమ్‌లు బలంగా ప్రచారం చేయడంతో ఈ సినిమాను ఎక్కువగా హైలైట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.ఇక ఆ తర్వాత విడుదలైన శర్వానంద్ నటించిన “నారి నారి నడుమ మురారి” అలాగే నవీన్ పోలిశెట్టి నటించిన “అనగనగా ఒక రాజు” సినిమాలకు కంటెంట్ పరంగా మంచి స్పందన వచ్చింది. ఈ రెండు సినిమాల్లో కామెడీ బాగా వర్క్ అయ్యింది, ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయినప్పటికీ, ఈ సినిమాలకు వచ్చిన మంచి టాక్ సోషల్ మీడియాలో అంతగా హైలైట్ కాలేకపోతోంది.
ఈ నేపథ్యంలోనే, కావాలనే కొన్ని పీఆర్ టీమ్‌లు ఈ రెండు సినిమాలను తొక్కేస్తున్నాయంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శర్వానంద్ ఫ్యాన్స్ మాట్లాడుతూ, “మనసంకర వరప్రసాద్ సినిమా కంటే కూడా ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంది. అయినా ఎందుకు ఆ సినిమాను హైలైట్ చేయకుండా కావాలనే పక్కకు నెట్టి వేస్తున్నారు?” అంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి, ఈ సంక్రాంతి సీజన్లో నిజంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు తగిన గుర్తింపు దక్కడం లేదని, పీఆర్ ప్రచారాల కారణంగా కొన్ని సినిమాలే ఎక్కువగా ముందుకు వస్తున్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హీట్‌ను క్రియేట్ చేస్తోంది.