జైలర్2: బాలయ్య ప్లేసులో స్టార్ హీరో..?

Divya
సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023 లో వచ్చిన జైలర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆ సినిమాకి కొనసాగింపుగానే ప్రస్తుతం జైలర్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో కూడా క్యామియో రోల్స్ గురించి పలు రకాల వార్తలయితే వినిపిస్తున్నాయి. మరి సెకండ్ పార్ట్ లో ఎవరెవరు కనిపిస్తారని అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


జైలర్ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు జాకి ష్రాఫ్ కూడా నటించారు. జైలర్ 2 చిత్రంలో కూడా వీరందరి పాత్రలు కొనసాగుతాయని వీటితోపాటు మరికొంతమంది ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు కూడా నటించే అవకాశం ఉన్నదట. అలా అతిధి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు. రజినీకాంత్ గారంటే చాలా ఇష్టము ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటానని తెలియజేశారు.


జైలర్ సీక్వెల్ గతంలో నందమూరి బాలకృష్ణ నటించ బోతున్నట్టు వార్తలు వినిపించగా ఆ తర్వాత ఆయన స్థానంలోనే ఇప్పుడు విజయ్ సేతుపతిని తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఇలా తన క్యామియో పాత్రను ప్రకటించడంతో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో నటించారు విజయ్ సేతుపతి ఇప్పుడు మళ్లీ జైలర్ 2 చిత్రంలో కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన షారుక్ ఖాన్ కూడా ఇందులో ఒక క్యామియో పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లుగా నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఇటీవల ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న  ఈ చిత్రం 2026 జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: