అభిమానులకి కోపం తెప్పిస్తున్న ప్రశాంత్ నీల్..మళ్లీ ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో అదే తప్పు!?

Thota Jaya Madhuri
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో విపరీతమైన హైప్ నెలకొంది. అయితే ఆ హైప్‌కు తగిన విధంగా సినిమా నుంచి అధికారిక అప్డేట్స్ రావడం లేదన్న విషయం ఇప్పుడు అభిమానుల్లో అసంతృప్తిని పెంచుతోంది.ఈ చిత్రం ప్రస్తుతం నెమ్మదిగానే షూటింగ్ దశలో కొనసాగుతున్నట్టు సమాచారం. కానీ సినిమా కాస్టింగ్ విషయంలో ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇతర కీలక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల అభిమానులు సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాడన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు… సీనియర్ బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అనీల్ కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఇటీవల విడుదలైన అనిమల్ సినిమాతో పాటు పలు భారీ ప్రాజెక్ట్స్‌లో కీలక పాత్రల్లో నటిస్తూ తన సత్తా చాటుకున్నారు.ఈ వార్తలకు బలం చేకూర్చేలా, తాజాగా అనీల్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక పోస్ట్ షేర్ చేయడం గమనార్హం. దీంతో ఆయన నిజంగానే ఈ భారీ చిత్రంలో భాగమయ్యారా అనే చర్చలు మరింత ఊపందుకున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అభిమానులు మాత్రం త్వరగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నా  కనీస అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ప్రశాంత్ నీల్ తన సినిమాల విషయంలో ఎక్కువగా సైలెంట్‌గా ఉండడం తెలిసిందే. ఇప్పుడు ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్‌గా వినిపిస్తున్న పేరు) విషయంలోనూ అదే విధానం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.మొత్తానికి, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో, అధికారిక అప్డేట్స్ ఆలస్యం కావడం అభిమానుల్లో అసహనాన్ని పెంచుతోంది. అనీల్ కపూర్ కాస్టింగ్‌పై స్పష్టతతో పాటు, సినిమా నుంచి ఒక పక్కా అప్డేట్ వస్తే కానీ ఈ కోపం తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పుడు మరి మేకర్స్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: