ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ యాక్టర్..?

Divya
కేజిఎఫ్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం డ్రాగన్. ఈ సినిమా ఎన్టీఆర్ 31వ చిత్రంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తెలుగులో దేవర సినిమా తర్వాత నటిస్తున్న చిత్రం డ్రాగన్ ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించగా ఈ సినిమా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా చితంగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఇందులో పలువురు సెలబ్రెటీలు నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని తాజాగా ఇప్పటివరకు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ నటుడు అనిల్ కపూర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక స్టోరీని పంచుకున్నారు.


డ్రాగన్ సినిమా పోస్టర్ ను పంచుకుంటూ ఒక సినిమా వచ్చేసింది మరో రెండు లైన్లో ఉన్నాయంటూ తెలియజేశారు. ఎన్టీఆర్ తో కలిసి అనిల్ కపూర్ నటిస్తున్న రెండవ చిత్రం ఇది గతంలో వీరిద్దరూ కలిసి వార్ 2 చిత్రంలో కలిసి నటించారు. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా తర్వాత రెండవ సారి సౌత్ ఇండియన్ డైరెక్టర్ చిత్రంలో అనిల్ కపూర్ కనిపించబోతున్నారు. మరి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ డ్రాగన్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారని విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేయగా అక్కడ కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు సమాచారం. ఎన్టీఆర్ కూడా గతంలో ఎన్నడు చేయని ఒక విభిన్నమైన మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవల ఎన్టీఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కూడా చాలా విభిన్నమైన లుక్ లో  కనిపించారు. మొత్తానికి అనిల్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అఫీషియల్ గా చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: